చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఫేస్ బుక్ క్షమాపణలు కారణం వింటే మతిపోతుంది

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఫేస్ బుక్ క్షమాపణలు కారణం వింటే మతిపోతుంది

0
104

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ని ప్రపంచంలో చాలా మంది ఉపయోగిస్తారు అయితే ప్రపంచంలో అత్యధికం జనాభా ఉన్న చైనాలో మాత్రం తక్కువ మంది ఉపయోగిస్తారు.. అయితే తాజాగా అదే చైనా దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు ఫేస్ బుక్ క్షమాపణలు చెప్పింది ..దీని వెనుక ఓ కారణం కూడా ఉంది.

జిన్పింగ్ ప్రస్తుతం మయన్మార్ పర్యటనలో ఉన్నారు. మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో భేటీ అయిన జిన్పింగ్ మౌలిక సదుపాయాల ప్రణాళికకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ భేటీ గురించి ఆంగ్ సాన్ తన ఫేస్బుక్ ఖాతాలో బర్మీస్ భాషలో పోస్ట్ పెట్టారు. బర్మీస్ భాషలో ఉన్న పోస్ట్ను ఫేస్బుక్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది. టెక్నికల్ అంశాల విషయంలో ఫేస్ బుక్ చాలా జాగ్రత్తగా ఉంటుంది కాని ఇక్కడ అజాగ్రత్త వ్యవహరించింది.

ఈ ట్రాన్స్లేషన్లో మిస్టర్ జిన్పింగ్ అనే పేరుకు బదులుగా మిస్టర్ షిట్హోల్ అని వచ్చింది. దీంతో ఈ వార్త వైరల్ అయిపోయింది. చైనాలోనే కాదు మయన్మార్ లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది, ఫేస్ బుక్ ఇలా దేశ అధ్యక్షుడు అకౌంట్ విషయంలో ఇలా వ్యవహరించడం ఏమిటి అని విమర్శలు వచ్చాయి.

ఫేస్బుక్పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పును వెంటనే సరిదిద్దుకున్న ఫేస్బుక్ సంస్థ చైనా అధ్యక్షుడికి క్షమాపణలు తెలిపి.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బర్మీస్ భాషలోని కొన్ని పదాలను ట్రాన్స్లేట్ చేసే క్రమంలో ఈ తప్పులు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి విషయాలలో ఫేస్ బుక్ టెక్నికల్ కోడింగ్ లాంగ్వేజ్ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా మంది నెటిజన్లు సలహా ఇచ్చారు.