చైనా వస్తువులే కాదు అవి కూడా బ్యాన్ చేయాలని పిలుపు

చైనా వస్తువులే కాదు అవి కూడా బ్యాన్ చేయాలని పిలుపు

0
100

మన దేశం పై చైనా ఇష్టం వచ్చిన రీతిన దొంగ దెబ్బ తీసింది.. దీనిని భారతీయులు తట్టుకోలేకపోతున్నారు, మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ మన సొమ్ముతో మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి, చైనా వ్యాపారాలు చాలా వరకూ మూతపడేలా సోషల్ మీడియాలో బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అంటూ పిలుపు ఇస్తున్నారు.

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీస్ ఫుడ్ను విక్రయించే రెస్టారెంట్లపై భారత్లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు, అంతేకాదు చైనా యాప్స్ కూడా వాడద్దు అనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది.

ఈ సమయంలో ఆ రెస్టారెంట్ల లో కూడా అమ్మకాలు చేయకుండా చేస్తే ఇక చైనా రెస్టారెంట్లు ఇండియాలో ఇక బోర్డు తిప్పాల్సిందే, తాజాగా ఈ విషయంలో కేంద్రం కూడా వెనక్కి తగ్గేలా లేదు, చైనాఈ దెబ్బకి ఆర్ధికంగా ఇరకాటంలో పడనుంది.