చైనాలో ధనవంతుల కోసం కొత్త బాడీ గార్ట్స్ – ప్రపంచంలో తొలిసారి

చైనాలో ధనవంతుల కోసం కొత్త బాడీ గార్ట్స్ - ప్రపంచంలో తొలిసారి

0
99

ధనవంతులకి బాడీ గార్ట్స్ ఉంటారు అనే విషయం తెలిసిందే.. వారు బయటకు వెళ్లారు అంటే మినిమం 10 నుంచి ఇరవై మంది బాడీ గార్డ్స్ ఉంటారు, అయితే ఇప్పుడు ఈ బాడిగార్డ్స్ విషయంలో చైనాలో ధనవంతులు ఏరి కోరి ఎంచుకుంటున్నారట.

డిజిటల్ డార్క్ ఆర్ట్స్లో నైపుణ్యం కలిగిన బాడీగార్డులను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఈ కళలో శిక్షణ పొందినవారికి ఇప్పుడు చైనాలో బోల్డంత డిమాండ్ ఉంది. ఇక చాలా మంది కావాలి అని కోరుతున్నారు, కాని సరైన శిక్షణ పొందిన వారు లేరట.

బాడీగార్డ్స్కు ఇచ్చే శిక్షణతోపాటు డిజిటల్ డార్క్ ఆర్ట్స్లోనూ శిక్షణ ఇస్తున్నాయి పలు సెక్యూరిటీ సంస్ధలు. టెక్నాలజీ యుగంలో సంపన్నులకు హ్యాకర్లతో అనుక్షణం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రంగంలోనూ శిక్షణ పొందిన గార్డుల కోసం చైనా సంపన్నులు క్యూ కడుతున్నారు.
ఇందులో మిలటరీ శిక్షణ కంటే కఠినంగా ఉంటుంది.

ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ప్రతిరోజు బ్లాక్ బిజినెస్ సూట్స్ ధరించి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు. చాలా వేగంగా డ్రైవింగ్ చేస్తారు, ఎవరిని అయినా ఎదిరించి ఆ యజమానిని కాపాడతారు, బులెట్ కి గన్స్ కి భయపడరు, వీళ్లు హ్యాకర్లు చేసే పనిని తెలుసుకుని దానిని కూడా ఎదిరించి ధనవంతుల సొమ్ము వారి కంపెనీ డేటా కాపాడతారు, సో మొత్తానికి చైనాలో ఇప్పుడు దీనికి డిమాండ్ బాగా పెరిగింది.