ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన సవాల్ విసిరారు. ఆయనపై నమోదు అయిన కేసులో భాగంగా ప్రస్తుతం పరారిలో ఉన్నారని వార్తా కథనాలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించారు.
తనపై క్రమంగా కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు… పోలీసులు ఏపీ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తోందని చింతమనేని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 10 రోజులు కనిపించకుండా తిరిగితే పోలీసులు తనను పట్టుకోలేకపోయారని అన్నారు.
తాను తన నివాసానికి వస్తున్నట్లు సమాచారం ఇస్తే అధికారులు అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నట్లు అనుకుంటున్నాని అరోపించారు. తనపై అక్రమంగా పెట్టిన కేసులను సక్రమంగా విచారణ చేయించాలని తాను అక్రమాలకు పాల్పడినట్లు ఈ విచారణలో రుజువు అయితే తన నియోజకవర్గ ప్రజలకు తన ఆస్తిని ఫ్రీగా రాసిస్తానని సవాల్ విసిరారు.