చిరంజీవి వర్సెస్ వర్లరామయ్య మెగా కౌంటర్

చిరంజీవి వర్సెస్ వర్లరామయ్య మెగా కౌంటర్

0
102

మొత్తానికి రాజధానిపై చిరంజీవి చేసిన కామెంట్లు జగన్ చేసిన కామెంట్ల కంటే హీట్ పుట్టిస్తున్నాయి.. మూడు రాజధానులకు చిరంజీవి కూడా సమర్దించారు, అయితే ఆయన చేసిన కామెంట్లపై రాజధానిలో కొందరు రైతులు అలాగే తెలుగుదేశం నేతలు దీనిని తప్పుబడుతున్నారు.. చిరంజీవి ఆలోచించి మాట్లాడటం లేదు అని అసలు ఎలా సమర్దిస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు.

చిరంజవి మూడు రాజధానులకు మద్దతు పలకడాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. చిరంజీవి అన్ని విషయాలు తెలుసుకున్నాక ప్రకటన చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. చిరంజీవి వ్యాఖ్యలను అవగాహన లేని రాజకీయనేత చేసిన వ్యాఖ్యల్లా చూడాలా? పరిపక్వత లేని పౌరుడు, సినిమా నటుడు చేసిన వ్యాఖ్యల్లా తీసుకోవాలా? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. అయితే వర్ల రామయ్య రాజకీయంగా టీడీపీతో ఉన్నారని, చంద్రబాబు టికెట్ పదవులు అవకాశాలు ఇస్తే పదవులు తీసుకుంటారు.

కాని చిరంజీవి దేశంలో ఫేమ్ ఉన్న పర్సెన్, రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఆయన గురించి వర్ల ఇలా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు అని మెగా అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం ఓ పార్టీకి మాత్రమే వర్ల సపోర్ట్ చేస్తున్నారు కాని చిరంజీవి మూడు ప్రాంతాల డవలప్ మెంట్ కోసం దీనిని స్వాగతించారు అని చెబుతున్నారు అభిమానులు.