ఏపీ సర్కార్ కు చిరంజీవి సూచన..దేని గురించంటే?

0
84

సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మెగాస్టార్​ చిరంజీవి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్​లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

అదే సమయంలో టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. దేశమంతా ఒకటే జీఎస్టీ పన్నులు వసూలు చేస్తున్న తీరును ఉదహరించిన చిరంజీవి..టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు కల్పించాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగానే ఏపీలోనూ టికెట్ ధరలను నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.

థియేటర్ల మనుగడ కోసం, సినిమాపై ఆధారపడ్డ కుటుంబాల కోసం ఏపీ ప్రభుత్వం ఆలోచించాలని  మెగాస్టార్ చిరు సూచించారు. ప్రభుత్వ ప్రోత్సహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

https://twitter.com/KChiruTweets