చిరుని అన్న‌య్యా అంటూ మాజీ మంత్రి గంటా మంచి రిప్లై

చిరుని అన్న‌య్యా అంటూ మాజీ మంత్రి గంటా మంచి రిప్లై

0
82

సోష‌ల్ మీడియాలో చిరంజీవి ఇక యాక్టీవ్ అయ్యారు.. ట్విట్ట‌ర్ లోకి ఎంట‌ర్ అయిన వెంట‌నే ఆయ‌న్ని వేల మంది ఫాలో అవుతున్నారు, ఇక ఆయ‌న తాజాగా సినిమా న‌టులు అంద‌రి కామెంట్ల‌కు రిప్లై ఇస్తున్నారు, ఇక తాజాగా దీనిపై మాజీ మంత్రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వెల్ కమ్ ప‌లికారు.

దీనిపై చిరు కూడా స్పందించారు. థ్యాంక్యూ మై బ్రదర్. అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా కరోనా అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ను వైజాగ్ ఎలా ఎదుర్కొంటోంది? ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలన్న సందేశాన్ని ప్రజలకు చెప్పడంలో మీ వంతు కృషి మీరు చేస్తున్నారని ఆశిస్తున్నానని చిరంజీవి అన్నారు..

దీనిపై గంటా శ్రీనివాస‌రావు కూడా బ‌దులిచ్చారు, య‌స్ అన్న‌య్య అని అన్నారు. మొత్తానికి గంటా మ‌ధ్య చిరు మ‌ధ్య ఏనాటి నుంచి మంచి అనుబంధం ఉంది, ఆయ‌న పార్టీ పెట్టిన స‌మ‌యంలో గంటా కూడా ప్ర‌జారాజ్యంలో చేరిన సంగ‌తి తెలిసిందే.