చిరు రాజ్యసభ సీటుపై నాగబాబు సంచలన కామెంట్స్

చిరు రాజ్యసభ సీటుపై నాగబాబు సంచలన కామెంట్స్

0
84

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఆశావహులు పెరుగుతున్నారు, అయితే వైయస్ షర్మిలతో పాటు చిరంజీవి పేరు కూడా వినిపించింది.. తమ్ముడి పార్టీ కాకుండా వైసీపీలో చిరు చేరతారు అని, ఆయనకు జగన్ రాజ్యసభ సీటు ఇస్తారు అని వార్తలు వినిపించాయి.. అయితే మెగా అభిమానులు కూడా షాక్ అయ్యారు ..అసలు దీనిపై మెగా కుటుంబం స్పందిస్తుందా అని చూశారు.

తాజాగా దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు.. తన అన్నయ్య చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని చెప్పారు.. ఆయన ఏ పార్టీలో చేరరు, ఏ పార్టీ ఇచ్చిన పదవులు తీసుకోరు అని అన్నారు.. మాకుటుంబం నుంచి ప్రజా సేవ చేయాలి అని ఆలోచనలో ఉన్న పవన్ కల్యాణ్ కు సపోర్ట్ ఇస్తున్నాము అని అన్నారు, ఆయనకు ఆసత్తా ఉంది అని చెప్పారు నాగబాబు.

ఇక చిరు వైసీపీలో చేరుతారు అని వస్తున్న వార్తలు అసత్యం అని తెలిపారు…ఇది కావాలనే కొందరు వైసీపీ నేతలు వారి మీడియాలు చేస్తున్న ప్రచారం అని తెలిపారు, సో దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ క్లారిటీ ఇచ్చారు, ఇక ఆయన ఏ పార్టీలో చేరరు అని తేలింది, వైసీపీలో చేరుతారు అని వస్తున్న వార్తలకు మెగా స్టార్ ఇలా తమ్ముడితో క్లారిటీ ఇప్పించారు అని టాక్ నడుస్తోంది.