చిరుతో భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత…

చిరుతో భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...

0
79

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరా రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు… అనంతపురం జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠాపురంలో నూతనంగా 52 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు…

ఈ విగ్రహ ఆవిష్కరణ మే 29న జరుగనుంది… ఈ ఆవిష్కరణకు చిరంజీవి తప్పకుండా రావాలని రఘువీరా రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఆహ్వానించారు… తప్పకుండా వస్తానని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది…

కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రఘువీరా రెడ్డి రాష్ట్ర మంత్రిగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత చిరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు… ఇప్పుడు ఆయన సినిమాల్లో నటిస్తున్నారు…