చిత్తూరు మాజీ ఎమ్మెల్యే చనిపోతే రామ్ చరణ్ ఎందుకు వెళ్లారో తెలుసా – రీజన్ ఇదే

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే చనిపోతే రామ్ చరణ్ ఎందుకు వెళ్లారో తెలుసా - రీజన్ ఇదే

0
99

తితిదే మాజీ చైర్మన్ సీనియర్ రాజకీయ నేత ఆదికేశవులు నాయుడు భార్య.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ ఇటీవల మరణించారు, ఈ వార్త టీడీపీ శ్రేణులని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది, అయితే ఆమె అనారోగ్యం కారణంగా మరణించారు, బెంగళూరులో ఆమె చికిత్స పొందుతూ మరణించారు, ఇక మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ చనిపోయారు అని తెలియగానే. హీరో రామ్ చరణ్ బెంగళూరు వెళ్లారు. అక్కడ ఆయన ఆ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభని చివరి చూపు చూశారు.

అయితే చరణ్ కి వారి కుటుంబానికి ఏమైనా బంధుత్వం ఉందా అని చాలా మంది ఆలోచించారు, అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఆదికేశవులు నాయుడు కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది, చిరుకి ఆయనమంచి సన్నిహితుడు.

ఆదికేశవులు.. సత్యప్రభల తనయుడు డీకే శ్రీనివాస్ తో చరణ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక చరణ్ కు డీకే శ్రీనివాస్ మంచి మిత్రుడు చిరు ఆదికేశవులు ఎలా మిత్రులో అలాగే వీరిద్దరూ కొన్నేళ్లుగా మిత్రులు, తన మిత్రుడి కుటుంబం ఇలా బాధలో ఉంది అని తెలిసి చరణ్ సంతాపం తెలిపేందుకు వెళ్లారు.