ఆలయాల్లో ప్రసాదం అంటే లడ్డూ దద్దోజనం పులిహోర ఇలాంటివి విన్నాం.. కాని ఇక్కడ విచిత్రంగా ఏం ప్రసాదం పెడతారో తెలుసా మీకు ఆశ్చర్యం కలుగుతుంది, అక్కడ నైవేద్యంగా ప్రసాదంగా చాక్లెట్స్ పెడతారు స్వామికి…కేరళలోని షేమత్ శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో స్వామికి పెట్టే నైవేద్యానికి ఈ ప్రత్యేకత ఉంది, ఇక్కడ చాక్లెట్లని నైవేద్యంగా పెడతారు, మరి దీని వెనుక ఉన్న స్టోరీ చూద్దాం.
ఇక్కడ మొక్కులు తీర్చుకోవాలి అని వచ్చే భక్తులు శ్రీ సుబ్రహ్యణ్య స్వామికి చాక్లెట్లు మాత్రమే తీసుకెళ్లి భక్తితో సమర్పించుకుంటారు. పువ్వులు పండ్లు ఆలయంలోకి తీసుకురారు, ఇక్కడ షాపుల్లో కూడా ఇవి అమ్మరు, ఇక భక్తులు కొనాలి అన్నా ఇక్కడ అమ్మడానికి పువ్వులు కొబ్బరికాయలు పండ్లు ఉండవు, మొత్తం షాపులు అన్నీ చాక్లెట్స్ షాపులే ఉంటాయి.
ఇక్కడ స్వాములు ఏం చెబుతారంటే, ఓ రోజు ఓ వేరేమతానికి చెందిన పిల్లాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి వచ్చాడట. అక్కడ కాసేపు ఆడుకొని గుడిలో ఉండే గంట కొట్టాడు.ఇక వారి తల్లిదండ్రులు ఇక్కడకు ఎందుకు వచ్చావని తిట్టి ఆ బాలుడ్ని కొట్టారట, దీంతో బాలుడికి రాత్రికి రాత్రి జ్వరం వచ్చేసింది, అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు, వైద్యులకి చూపించినా తగ్గలేదు.
పిల్లాడి ప్రాణం కాపాడమని స్వామి పట్ల మనం అపరాథం చేశామని పశ్చాత్తాపంతో పిల్లాడితోపాటూ తల్లిదండ్రులు కూడా మురుగన్ స్వామి పేరును రాత్రంతా జపించారట…ఇక తర్వాత రోజు ఆలయంలో ఆ అబ్బాయి చాలా చలాకీగా ఉన్నాడు, ఇది స్వామి మహిమ అని వారు ఆనందించారు, ఇక పూజారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు, మరి నీకు జ్వరం తగ్గింది కదా స్వామికి ఏమి ఇస్తావు అంటే ఆ పిల్లాడు చాక్లెట్ అని చెప్పాడట, అప్పటి నుంచి ఇక్కడ ఆలయంలో ఏ కోరిక కోరినా కచ్చితంగా నెరవేరుతుంది.. నెరవేరిన తర్వాత చాక్లెట్స్ తెచ్చి స్వామికి సమర్పిస్తారు, ఆ స్వామి దర్శనం తర్వాత అందరికి ఇవి ప్రసాదంగా పంచుతారు, పువ్వుల దండల రూపంలో ఈ చాక్లట్స్ దండలు స్వామికి వేస్తారు.