హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఏపీ పోలీసులు హల్‌చల్ చేశారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విజయ్, ఐటీడీపీ కో కన్వీనర్‌గా పని చేస్తున్నారు. కాగా, శనివారం ఆయన ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులకు, విజయ్ ఇంటి దగ్గర లేకపోవటంతో.. సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు ఇంకా విజయ్ ఇంటి దగ్గర్లోనే ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో, టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కనీసం ఎఫ్‌ఐర్ బయటపెట్టకుండా పోలీసులు నేరుగా ఇంటికి వెళ్లి కలకలం సృష్టించడమేంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఎందుకు వచ్చారో, కేసు ఏమిటో కూడా చెప్పలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి ఉందని విజయ్ కుటుంబ సభ్యులు వాపోయారు. ఐటీడీపీకి సంబంధించి రెండు రోజుల క్రితం విజయ్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారని పోలీసులు అభయోగం.. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి, ఎటువంటి ఎఫ్‌ఐఆర్ బయటకు రాలేదు.
హైదరాబాద్‌లో టీడీపీ నేత ఇంటి వద్ద పోలీసుల హల్‌చల్
-