సిగ‌రెట్ కి క‌రోనాకి లింక్ ఏమిటి? త‌ప్ప‌క తెలుసుకోండి

సిగ‌రెట్ కి క‌రోనాకి లింక్ ఏమిటి? త‌ప్ప‌క తెలుసుకోండి

0
86

క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా వృద్దుల‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది, వారిపై ఇది చాలా ప్ర‌భావం చూపిస్తోంది, అందుకే పెద్ద పెద్ద దేశాల్లో ఇలాంటి వారి మ‌ర‌ణాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి, ఇక స్త్రీల కంటే పురుషుల‌పై ఇది ప్ర‌భావం చూపిస్తోంది అని స‌ర్వే సంస్ధ‌లు వైద్యులు చెబుతున్నారు, ఇక ప‌లు వ్యాధులు ఉంటే వారిపై ముందే ఇది ప్ర‌భావం చూపిస్తోంది.

ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 71 శాతం మగవారే ఉన్నట్లు అంతర్జాతీయ కరోనా అప్ డేట్స్ ను అందించే సంస్ధ తెలిపింది, ముఖ్యంగా సిగ‌రెట్ చుట్ట పొగ తాగే అలవాటు ఉండడం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడడం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.

అంతేకాదు ముఖ్యంగా ఉబ్బసం, డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఈ వ్యాధి వెంటనే సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు, ఇది వ‌చ్చిన రెండు మూడు రోజుల్లో గుర్తిస్తే చికిత్స తీసుకుంటే వారికి ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు అని చెబుతున్నారు.