గురువారం సినీ పొలిటికల్ స్టార్లు సంచలన నిర్ణయం

గురువారం సినీ పొలిటికల్ స్టార్లు సంచలన నిర్ణయం

0
104

మొత్తానికి ఈ నెల 23న ఏపీ ఫలితాలు రానున్నాయి.. అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఈ ఎన్నికల్లో జరిగింది అని చెప్పాలి.. తెలుగుదేశం పార్టీకి ఈసారి మెజార్టీ సీట్లు వస్తాయి అని సర్వేలు చెబుతుంటే, అంతకంటే ఎక్కువ వైసీపీ గెలుస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి.. అయితే లగడపాటి సర్వేని కూడా ఇది తెలుగుదేశం సర్వే అని చెబుతున్నారు చాలా మంది. 130 స్ధానాల్లో సర్వే చేసి 100 పైనే తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పడం ఏమిటి, మిగిలిన 45 చోట్ల సర్వే చేయకుండా ఎలా మొత్తం సీట్లు కాలిక్యులేట్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

ఇక తాజాగా జగన్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు సినిమా ఇండ్టస్డ్రీలో సగం మంది జగన్ కు, మరికొందరు చంద్రబాబుకు సపోర్ట్ గా ఉన్నారు… అయితే ఫలితాల రోజు జగన్ వద్ద నేతలు ఫుల్ బీజీగా ఉంటారు, ఆరోజు జగన్ గెలిచిన వెంటనే ఆయన ఫుల్ బీజీ అవుతారు.. అందుకే తాడేపల్లికి కొందరు సినిమా స్టార్లు చేరుకోనున్నారు అని తెలుస్తోంది. దీనికి కారణం కూడా చెబుతున్నారు.. ఈసారి ఎన్నికల్లో సినిమా స్టార్లు బాగా సపోర్ట్ చేశారు జగన్ కు, ఇవన్నీ ఆయనకు పాజిటీవ్ వేవ్స్ తీసుకువస్తాయి అని చెబుతున్నారు. అందుకే వారు జగన్ వద్దకు రానున్నారు అలీ, చిన్నికృష్ణ, మోహన్ బాబు, రచయిత దర్శకుడు పోసాని, భానుచందర్చ, ఇలా పలువురు వైసీపీ అధినేత జగన్ వెంట ఉండనున్నారట. ఏపీకి కచ్చితంగా జగన్ సీఎం అవుతారు అని చెబుతున్నారు. ఈసారి పొలిటిలక్ క్యాంపెయినింగ్ కు కూడా వారు పార్టీకి చాలా సాయంచేశారు అనేది తెలిసిందే, అందుకే తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. మరి ఫలితాలకు ముందు రోజే గుంటూరు జిల్లా చేరుకోవాలి అని నేతలు చూస్తున్నారు.