సినిమా ప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

సినిమా ప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

0
82

దాదాపు 80 రోజులుగా సినిమాలు ఆగిపోయాయి, దీంతో ఇటు చిత్ర ప‌రిశ్ర‌మ చాలా న‌ష్టాల్లో నిండిపోయింది..ఓ ప‌క్క ఉపాధి లేక ఇబ్బంది ప‌డుతున్నారు.. ఇలా 80 రోజులుగా సినిమాలు షూటింగులు లేక ఇబ్బంది ప‌డుతున్నారు కార్మికులు, అయితే ఇప్ప‌టికే చిత్ర నిర్మాత‌లు ద‌ర్శ‌కులు హీరోలు సీఎం కేసీఆర్ ని క‌లిసి షూటింగుల‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వాలి అని కోరారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల‌కు షూటింగుల‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక కేంద్రం ఎప్పుడు సినిమా థియేట‌ర్లు ఓపెన్ చేయాలి అని చెబుతుందో అప్ప‌టి వ‌ర‌కూ థియేట‌ర్లు మూసి ఉంటాయి.