సిటీ సెంటర్ లో ఉరి వేసుకుంటా వైసీపీ ఎమ్మెల్యే…

సిటీ సెంటర్ లో ఉరి వేసుకుంటా వైసీపీ ఎమ్మెల్యే...

0
95

కరోనా విస్తరిస్తున్న సమయంలో ఏపీలోని రాజకీయాలు ఉప్పు నిప్పులా కొనసాగుతున్నాయి… ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న కర్నూల్ జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ఇటీవలే మాజీ మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ… కర్నూల్ జిల్లాలో కరోనా కేసులు వ్యాప్తికి కారణం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అలాగే ఎంపీ సంజయ్ కుమార్లేనని ఆరోపించింది…

ఇక ఆమె చేసిని వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు…. అఖిలప్రియ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవని అన్నారు… కరోనాను అడ్డుకునే క్రమంలో తాను ముందు వరుసలో ఉంటానని అన్నారు… అన్ని మసీదులు మూసివేశామని మర్కాజ్ వెళ్లి వచ్చివారి ఇంటికి వెళ్లి క్వారంటైన్ కు తరలించామని చెప్పారు… అఖిల ప్రియ చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పుకోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు… తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే కర్నూల్ సెంటర్ లో ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు…