గుడ్ న్యూస్ – ఏపీలో న‌డ‌వ‌నున్న సిటీ బ‌స్సులు ఎప్ప‌టినుంచంటే?

గుడ్ న్యూస్ - ఏపీలో న‌డ‌వ‌నున్న సిటీ బ‌స్సులు ఎప్ప‌టినుంచంటే?

0
104

మార్చి నెల చివ‌రి వారం నుంచి ప్ర‌జార‌వాణా విష‌యంలో వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా బ‌స్సు స‌ర్వీసులు నిలిపివేశారు, అయితే స్పెష‌ల్ బ‌స్సులు ట్రైన్స్ త‌ర్వాత రెండు నెల‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు, ఈ స‌మ‌యంలో అన్ లాక్ నిబంధ‌న‌లు విడుద‌ల అవుతున్నాయి.

అయితే మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్దితులు నెల‌కొంటున్నాయి, అన్నీ రంగాల వారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఈ స‌మ‌యంలో ఏపీలో సిటీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో మే 20న ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కేవ‌లం జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి, క‌ర్ణాట‌క కు స‌ర్వీసులు న‌డుస్తున్నాయి, ఇక త‌మిళ‌నాడు హైద‌రాబాద్ కు మాత్రం ఇంకా బ‌స్సులు అంత‌రాష్ట్ర స‌ర్వీసులు న‌డ‌వ‌డం లేదు. ఈ స‌మ‌యంలో సిటీ స‌ర్వీసులు న‌డపాలి అని చూస్తున్నారు..విజయవాడ,విశాఖపట్నం లో ఈ నెల 20 నుంచి స‌ర్వీసులు స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంది అంటున్నారు, అంతేకాదు ఏపీలో ప‌ది ల‌క్ష‌ల మంది స‌చివాల‌య ఉద్యోగాల‌కు అప్లై చేసిన వారు ప‌రీక్ష రాయాల్సి ఉంది..ఈ నెల 20 నుండి 26 వరకు సచివాలయ ఉద్యోగాలకోసం రాత‌ప‌రీక్ష‌లు ఉన్నాయి, అందుకే బ‌స్సులు క‌చ్చితంగా న‌డ‌వ‌నున్నాయి అంటున్నారు.