ఝార్ఖండ్‌లో యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సొరేన్ నెగ్గారు. విశ్వాస పరీక్షలో 81 మంది సభ్యులు పాల్గొనగా.. సోరెన్‌కు 48 మంది సభ్యులు మద్దతు తెలిపారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యంత్రి హేమంత్ సోరెన్.. భాజపా తీరుపై మండిపడ్డారు.