ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా కొనసాగిస్తూ నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కు అప్పగించాలని చూస్తున్నారట…
ఈ కారణంతోనే టీడీపీలో ఉన్న డొక్కాను ఆ పార్టీకి రాజీనామా చేయించి మళ్లీ ఎమ్మెల్సీగా ఆయనను ఎప్పిక చేశారని కొందరుచర్చించుకుంటున్నారు…డొక్కాను క్రియశీలికంగా తీసుకురావాలంటే తాడికొండ బాధ్యతలను అప్పజెప్పితేనే సాధ్యం అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోందట.. అంతేకాదు శ్రీదేవి తప్పుడు కుల సర్టిఫికెట్ ఇచ్చి ఎన్నికయ్యారని ఆధారాలతో సహా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు…
దీంతో రాష్ట్రపతి స్పందించి విచారణ జరిపి నివేదిక అందజేయాలని కేంద్ర ఎన్నికల సమిషన్ ను ఆదేశించింది… ఒక వేళ శ్రీదేవి ఎమ్మెల్యేగా అనర్హురాలని తేలితే అప్పటికప్పుడు నిర్ణయం తిసుకునేకన్నా ముందుగానే మాజీ మంత్రి డొక్కాకు తాడికొండ బాధ్యతలు అప్పిగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి… అంతేకాదు శ్రీదేవిపై సెగ్మెంట్ వ్యతిరేకత కూడా ఎక్కువ అవుతోందట.. అందుకే ఆమెను ఎమ్మెల్యేగా కొనసాగిస్తూ నియోజకవర్గ బాధ్యతలను డొక్కాకు అప్పగించాలని పార్టీ అధిష్టానం బావిస్తోందట..