సీఎం జ‌గ‌న్ గారి పై కుట్ర జ‌రుగుతోంది – హీరో రామ్ సంచ‌ల‌న ట్వీట్

సీఎం జ‌గ‌న్ గారి పై కుట్ర జ‌రుగుతోంది - హీరో రామ్ సంచ‌ల‌న ట్వీట్

0
88

టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సంచ‌ల‌న ట్వీట్ చేశారు, ఆయ‌న సినిమాల్లో ఎంతో బిజీ.. అయితే తాజాగా రాజ‌కీయంగా ఆయ‌న చేసిన ట్వీట్ పెద్ద సంచ‌ల‌నం అయింది, తాజాగా రామ్ ఏపీలో జ‌రిగిన ఓ ఫైర్ ఇన్సిడెంట్ పై ట్వీట్ చేశారు.

సీఎం జగన్ గారూ పెద్ద కుట్ర జరుగుతోన్నట్టుంది అంటూ ట్వీట్ చేశారు రామ్.. ఏపీ సీఎం జ‌గ‌న్ ని త‌ప్పుగా చూపించ‌డానికి ఈ కుట్ర చేస్తున్నట్లు ఉన్నారు అని తెలిపారు వైయ‌స్ జ‌గన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కి, అలాగే మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం అని రామ్ ట్వీట్ చేశారు

అంత‌కు ముందు ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?ఫీజుల‌ వివ‌ర‌ణ‌: మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది.

హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు అని ట్వీట్ చేశారు. ఇప్పుడు రామ్ లెవ‌నెత్తిన ఈ అంశం పై చ‌ర్చ జ‌రుగుతోంది.