ఏపీ వాహనదారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

CM Jagan gives good news to AP motorists

0
108
CM Jagan

ఏపీ వాహనదారులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీతో ఏపీలోనూ పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ పై రూ.1.51, డీజిల్‌పై రూ. 2.22 మేర వ్యాట్‌ తగ్గింది. ఈ నిర్ణయంతో డీజిల్‌పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్‌పై రూ. 226 కోట్ల మేర వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది.

కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలుపై రూ. 4.85 కు వ్యాట్ తగ్గింది. ఏడాదికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది.ఇక తాజా వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందని చెబుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీ సర్కార్ నష్టం వాటిల్లనుంది.