గుడ్ న్యూస్ తో పాటు పత్రాలు ఇచ్చేసిన సీఎం జగన్

గుడ్ న్యూస్ తో పాటు పత్రాలు ఇచ్చేసిన సీఎం జగన్

0
92

ఏపీలో నెల రోజులగా ఒకటే చర్చ ఎవరికి సీఎం జగన్ రాజ్యసభ సీట్లు ఇవ్వనున్నారు అని , దీనిపై మొత్తానికి జగన్ పార్టీ తరపున ప్రకటన చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్ నత్వానీ రాజ్యసభ నుంచి పోటీ చేయనున్నారు.

ఇక వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వారు ధన్యవాదాలు తెలిపారు, ఇక మంత్రులుగా కూడా వారు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు, తాజాగా ఆ నలుగురు నాయకులకు పార్టీ తరపున బీ ఫాం అంద చేశారు సీఎం జగన్ ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు బీ-ఫారాలు ఇచ్చాను అని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు.మొత్తానికి అంబానీ కోరిక మేరకు ఆయనకు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు అనే చెప్పాలి.