సీఎం జగన్ ని డైలమాలో పడేసిన మంత్రి హరీష్ రావు

సీఎం జగన్ ని డైలమాలో పడేసిన మంత్రి హరీష్ రావు

0
83

ఏపీలో మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై తొలి నుంచి తెలుగుదేశం పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు చేస్తూనే ఉంది.. విశాఖ ఎగ్జికూటివ్ కాపిటల్ అవ్వడానికి వీలు లేదు అని చెబుతున్నారు అమరావతినే ఉంచాలి అని కోరుతున్నారు.

వైఎస్ జగన్ అద్భుత పాలనా పాటవాల గురించి పక్క రాష్ట్రాల మంత్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూడండి అంటూ ఓ వీడియో పోస్టు చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ . అందులో తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఏపీలో పరిస్థితులు బాగా కలిసొచ్చాయి అంటూ వ్యాఖ్యానించడం చూడొచ్చు.

ఏపీ రాజధాని అమరావతిలో అనిశ్చితి కారణంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుందన్న కోణంలో ఆయన వ్యాఖ్యానించారు. . అయితే ఒక స్టేట్ పై పక్క స్టేట్ మంత్రి ఇలా కామెంట్ చేస్తున్నారు మరి సీఎం జగన్ గారి పాలన అలా ఉంది అంటూ సటైర్ వేశారు లోకేష్, అయితే ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.