రేపు ఢిల్లీకి సీఎం జగన్..కేంద్ర పెద్దలతో కీలక భేటీ

CM Jagan to visit Delhi tomorrow

0
98

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చింనున్నట్లు సమాచారం.

జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. దీంతో ఈ పర్యటనలో జగన్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని ముఖ్యులతో ముఖ్యమంత్రి చర్చింనున్నట్లు తెలుస్తోంది.

విభజన నేపథ్యంలో ఇచ్చిన అన్ని హామీలను సత్వరమే నెరవేర్చాలని ప్రధానికి వినతి పత్రం ఇవ్వనున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు. 9, 10 షెడ్యూల్ లోని అంశాలు సహా ఇంకా పరిష్కారం కాని అంశాలను సత్వరమే పరిష్కరించాలని కోరనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశాలున్నాయి.