ఆ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..ప్రమోషన్స్‌ కి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం

0
107

సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఉద్యోగులకు ప్రమోషన్స్‌ కి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రభుత్వం కొత్తగా 85పోస్టులు క్రియేట్ చేసింది. ఈ నిర్ణయంతో 85 పోస్టుల్లో 55 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్ రానుంది.

అలాగే మరో 30 మంది ఎస్‌ఓలకు అసిస్టెంట్, డిప్యూటీ, జాయింట్‌, అడిషనల్ సెక్రటరీలుగా పదోన్నతికి అవకాశముంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. అయితే నిజానికి సచివాలయంలో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా ఏఎస్‌ఓ కేడర్‌ నుంచి భర్తీ చేస్తారు.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ హయాంలో ఒకసారి.. వైసీపీ ప్రభుత్వంలో మరోసారి ప్రభుత్వ విరమణ వయసు రెండేళ్లు పెంచారు. దీంతో రిటైర్మెంట్‌ ఏజ్‌ 62కు పెరిగింది. పైస్థాయి అధికారులు ఉద్యోగ విరమణ చేయకపోవడంతో కిందిస్థాయి ఏఎస్‌ఓ, ఎస్‌ఓ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం లేకుండాపోయింది. లేటెస్ట్‌గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదోన్నతులకి లైన్ క్లియర్ అయింది.