3 రాజధానులపై సీఎం జగన్ కీలక ప్రకటన

CM Jagan's key statement on 3 capitals

0
81

రాజధానుల అంశంపై ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చామో బుగ్గన వివరించారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రేమ ఉందన్నారు సీఎం జగన్. తన ఇల్లు కూడా అమరావతిలో ఉందని చెప్పారు.

రాష్ట్రమంతా అభివృద్ది చెందాలన్నదే తన తాపత్రయమన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అని చెప్పారు. 3 రాజధానులపై సమగ్రమైన బిల్లను తీసుకొస్తామన్నారు. ఇంతకు ముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. విసృత, వివాల ప్రజల మేలు కోసమే చట్ట, న్యాయపరంగా అందరికీ సమాధానాలు చెప్పే విధంగా మళ్లీ బిల్లును తీసుకొస్తామన్నారు.