సీఎం జనగామ టూర్..కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

0
77

జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన మొదలైంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇటీవల కొత్త రాజ్యాంగం అవసరమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా నిరసనలు చేపట్టింది. అనంతరం రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపగా… రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణలు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.