కరోనా కొత్త వేరియెంట్ పై సీఎం కేసీఆర్ అలెర్ట్

CM KCR alert on new variant of Corona

0
154

కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా…ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియపై సమీక్షించిన సీఎం అధికారులను అలర్ట్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్​లో కొనసాగుతోంది. ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి శాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, ఔషధాల లభ్యత, ఆక్సిజన్ పడకలు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించారు.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో…. అధికారుల సన్నద్ధత, కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. వివిధ దేశాల్లో బయటపడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు.. ఆ దేశాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు నివేదిక అందించారు.