ముఖ్యమంత్రి కేసీఆర్ 26వ తారీకు అనగా ఈరోజు ఉదయం బెంగళూరు కు వెళ్లనున్న క్రమంలో ఎన్ని గంటలకు వేటిని సందర్శించనున్నాడు అనే అంశాలపై అధికారక షెడ్యూల్ రిలీజ్ చేసారు. ఈరోజు ఉదయం 9.45 కి ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్లిన అనంతరం 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు కు చేరుకోనున్నాడు సీఎం కేసీఆర్. ఆ తరువాత 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్ కి సీఎం కేసీఆర్ చేరుకోనున్నాడు.
ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తరువాత 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్ కి చేరుకొని కొన్ని నిమిషముల తరువాత అనగా 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయలుదేరనున్నట్టు సమాచారం తెలుస్తుంది. అనంతరం 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకొని దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థి పై ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని దేవగౌడ తో క్లుప్తంగా చర్చించనున్నాడు.
దేవగౌడ ఇంట్లో దాదాపు రెండున్నర గంటల పాటు ఉండి సమీక్ష నిర్వహించి వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆ చర్చ అనంతరం 3.45 కి దెవగౌడ నివాసం నుంచి హాల్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని..మళ్ళి 4 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కి తిరిగి బయలుదేరనున్నాడు. తుదకు 5 .10 కి ప్రగతి భవన్ కి చేరుకోనున్నాడు.