జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనగామలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుపడుతుంది. ఇంకా బాగుపడుతది. పది గ్రామాలకు నేషనల్ అవార్డ్స్ వస్తే అందులో తెలంగాణ నుండే ఏడు గ్రామాలున్నాయి. తెలంగాణలో ఎన్నటికీ కరెంటు పోదన్నారు.
అలాగే కేంద్రపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. 7 ఇళ్లల్లో కేంద్రంతో కొట్లాట పెట్టుకున్నామా? ఇప్పటికే అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం సామాన్యుల నడ్డి విరిచింది. నేను తెలంగాణ పులి బిడ్డ, జాగ్రత్త నరేంద్ర మోడీ..ఢిల్లీ కోట బద్దలు కొడతాం అంటూ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉడుత ఊపులకు పిట్ట బెదిరింపులకు బయపడవాన్ని కాదు అని కేసీఆర్ అన్నారు.
అంతేకాదు జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయాల్సి వస్తే తప్పకుండ మనం పోరాటం చేయాలి. కొట్లాడుదామా దేశం కోసం కూడా జాతీయ రాజకీయాల్లోకి పాత్ర వహించుదామా అంటూ కార్యకర్తలను అడిగారు.