ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. 700 మందిని పొట్టనబెట్టుకున్న పార్టీ బీజేపీది. మేము రైతు బంధువులం. మీరు రైతు రాబందులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నీకు దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనిపించు. కిషన్ రెడ్డి దద్దమ్మలా, ఉన్మాదిలా మాట్లాడారు. చేతకాని మాటలు మాట్లాడకండి. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పీయూష్ గోయల్ కూడా సిగ్గులేకుండా మాట్లాడారు. ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని చూడలేదంటూ విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
CM KCR Controversial remarks