ఢీ అంటే ఢీ..కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR fire on Central Government

0
81

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారన్నారు. కేంద్రం వైఖరిపై నిరసనగా ఎల్లుండి హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేయనున్నారు.

వడ్లు కొంటే ప్రాసెసింగ్‌లో భాగంగా బియ్యం చేయ‌డం కూడా కేంద్రం ఆధీనంలో ఉంది. ఎఫ్‌సీఐ గోడౌన్లు ధాన్యాన్ని నిల్వ చేయాలి. ఇది కేంద్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌. ఇవాళ రాష్ట్రానికో నీతి, ప్రాంతానికో నీతి అనే ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. పంజాబ్‌లో మొత్తం వ‌రి ధాన్యాన్ని కొంటున్నారు. మ‌న వ‌ద్ద నిరాక‌రిస్తున్నారు. కేంద్రం నుంచి ఉలుకుప‌లుకు లేదు. స‌మాధానం లేదు.

ఢిల్లీకి వెళ్లి సంబంధింత మంత్రిని క‌లిశాను. స్ప‌ష్టంగా అడిగాను. మీరు తీసుకున్న నిర్ణ‌యాలు బాలేవు. మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాల‌ని అడిగాము. ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర‌మంత్రి చెప్పారు. కానీ స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని అడిగాను. గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్‌లో చ‌ర్చించి ఐదు రోజుల్లో చెప్తామ‌ని చెప్పారు. కానీ ఈ రోజు వ‌ర‌కు ఉలుకుప‌లుకు లేదు.