తెలంగాణ సీఎం కేసీఆర్ దళితులకు శుభవార్త చెప్పారు. శరీరంలో ఒక అవవయం మంచిగా లేకపోయినా.. శరీరం అంతా బాాగున్నట్లు కాదు. అలాగే దళితులు కూడా అభివృద్ధి చెందినప్పుడే.. నిజమైన అభివృద్దని అన్నారు. దళిత బంధు ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు వర్తిస్తున్నామని.. మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ఏటా రెండు మూడు లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు.
అలాగే ఈ మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ రెండు వేల కుటుంబాలకు ఇస్తామని అన్నారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని మరోసారి వెల్లడించారు. దళిత బంధులో రూ. 10 లక్షలు ఇవ్వడమే కాదు.. మెడికల్ షాపుల్లో, ఫర్టిలైజర్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లో, బార్, వైన్ షాపుల్లో రిజర్వేషన్ పెట్టాం అని చెప్పారు. ఇంతకు ముందు వీటిలో రిజర్వేషన్లు లేవని అన్నారు. ఇలా భారత దేశంలో ఎక్కడ లేవని అన్నారు.