కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసేందుకు టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరితో సీఎం కేసీఆర్ నేడు కీలకభేటీ నిర్వహించారు. పార్టీ మీటింగ్లో సీఎం కేసీఆర్ రైతుబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని.. మిల్లర్లతో టై అప్ ఉన్నోళ్లు వరి వేసుకోనివ్వాలని సీఎం స్పష్టం చేశారు. ‘రైతు బంధు’ యథావిధిగా ఇస్తామని వ్యాఖ్యానించారు. వరి వేసే రైతులకు రైతుబంధు నిలిపివేయాలనే ప్రతిపాదనను కేసీఆర్ పక్కకు పెట్టారు. దీనితో రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అందనుంది.
Flash- రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
CM KCR good news for farmers