సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ప్రకటన చేశారు. ముంపు బాధితులకు కోసం ఎత్తైన ప్రాంతాలను చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10,000 ఇస్తామన్నారు. అలాగే 2 నెలల పాటు 20 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బాధిత ప్రజలను చేరుకోవడానికి సీఎం కేసీఆర్.. రోడ్డుమార్గాన్ని ఎంచుకున్నారు.