ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

0
79

ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేశామని..నూతన జోన్ల ఆమోదం తర్వాత క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ రూపొందించామని కేసీఆర్‌ తెలిపారు. త్వ‌రలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మి నిరుద్యోగులు మోస‌పోవ‌ద్దు. నిరుద్యోగుల‌కు నేను చెప్తున్నా..మంచి ఉద్యోగ క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఉద్యోగ నియామ‌కాలకు క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా నిబంధ‌న‌లు రూపొందించాం. నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మేలు చేస్తోందన్నారు.

జోన‌ల్ విధానం ప్ర‌కారం ఉద్యోగుల‌ను స‌ర్దుతున్నాం. ఒక‌ట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తాం. న‌వంబ‌ర్‌లో ఉద్యోగుల స‌ర్దుబాటు ప‌క్రియ పూర్తి చేసి..60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు ఇస్తాం అన్నారు.