ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ కేంద్ర సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రేపటి నుండి నీతి అయోగ్ ను బహిష్కరిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ ప్రకటనతో కేంద్రం పై కేసీఆర్ ఎంత గుర్రుగా ఉన్నారో అర్ధం అవుతుంది. అలాగే చేనేత వస్త్రాలపై జిఎస్టీ విధింపుపై కేసీఆర్ విమర్శించారు.
దేశంలో త్వరలో ఏకస్వామ్య పార్టీనే ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? తమాషాగా ఉందా? అంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. మాంజా, బ్లేడ్లు, నెయిల్ కట్టర్లు, జాతీయ జెండాలు సైతం చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటే. దిగుమతులన్నీ చైనా నుంచి రావడమే మేకిన్ ఇండియానా? అని ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు.