సీఎం కేసీఆర్ కీలక నిర్ణయంతో..ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయంతో..ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్

0
86

ఈ వైరస్ తో పూర్తిగా లాక్ డౌన్ అమలు జరిపింది కేంద్రం.. దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చింది సర్కార్ .. ఇక తెలంగాణలో జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి, కాని సీటీ బస్సులు హైదరాబాద్ లో నడిపే ఆలోచన చేయడం లేదు, ఇక ఇప్పుడు కేసులు పెరుగుతున్న కారణంతో సిటీ సర్వీసులు కొద్ది రోజులు ఆపాలి అని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఎయిర్పోర్ట్ సర్వీసులను కూడా నడపవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించాలన్నారు. ఇక ఏపీ ఇప్పటికే దీనిపై లేఖ కూడా రాసింది, దీనిపై ఒప్పందం కుదుర్చుకున్నాక బస్సులు నడపాలి అని తెలిపారు కేసీఆర్.

రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల నుంచి కేటగిరీలు వారీగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, వోల్వో బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో.. తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ఆయా రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్ల మేరకు తిరిగేలా పకడ్బందీగా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీకి బస్సులు మరికొద్ది రోజుల్లో నడపనున్నారు.