మునుగోడులో ప్రజాదీవెన సభ..కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్

0
76

సీఎం కేసీఆర్​ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ”నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని చెప్పాం. తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐకి కృతజ్ఞతలు. మునుగోడు నుంచి దిల్లీ వరకు ఐక్యత కొనసాగాలి.