Big News: సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్..ఈ అంశాలపై మాట్లాడే ఛాన్స్

0
106

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కాగా గతకొద్దిరోజులుగా తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. వరుస చేరికలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ బలపడగా అధికార తెరాస బలహీనపడింది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై, మునుగోడు ఉపఎన్నికపై, ముందస్తు ఎన్నికలపై, అలాగే ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ టిఆర్ఎస్ ను వీడిన నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ప్రజలు, రాజకీయ నాయకులూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.