తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ విషయాలపై మాట్లాడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర విభజనపై చాలా దుర్మార్గంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. ఇవాళ సీఎం కేసీఆర్ దీనిపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.