తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేయగా తాజాగా గంజాయి సాగు చేసే వారికి రైతుబంధు, సబ్సిడీలు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు అలాంటి వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు. ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.
Big Breaking: సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు..వారికి రైతుబంధు రద్దు!
CM KCR sensational orders .. Raitubandhu canceled for them