సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

CM KCR Sensational Press Meet

0
64

ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ఇక ధాన్యం సేకరణ చేసేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పింది. అందుకే యాసంగిలో రైతులు వరి పంటలు కాకుండా వేరే పంటలు వేయాలని మంత్రులు సూచించారు.

ప్రస్తుతం 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతుబందు, రైతుబీమా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో తప్పా..మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసాం. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. రైతుల సంక్షేమమే మా ధ్యేయం. అందుకే వారి కోసం ఎంతో కృషి చేస్తున్నాం. కానీ కేంద్రం పంట కొనుగోలులో తన బాధ్యతను విస్మరించింది. పంట నిల్వ చేసే గోడౌన్ లు కేంద్రం ఆధీనంలో ఉన్నాయి. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని అన్నారు. ధాన్యం నిలువ చేసే భారీ, శాస్త్రీయ గోదాములు రాష్ట్రంలో ఉండవని పేర్కొన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకంగా గోడౌన్ లు లేవు. ఈ ఏడాది 62 లక్షల ఎకరాల్లో వరి వేశారు. కానీ కేంద్రం ఈ ఏడాది ఎంత పంట తీసుకుంటుందో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రికి ఫోన్ చేసినా దీనిపై స్పందించలేదు. ఈ విషయంలో బండి సంజయ్ వరి వేయండి అని రైతులకు చెప్పడం బాధ్యతారాయిత్యాన్ని చూపిస్తుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరిని చంపుతావు. జైలుకు పంపిస్తావ్. నన్ను టచ్ చేసి చూడు. నేను చేతులు ముడుచుకొని చూస్తానా అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బతికుండగానే రైతులను మోసం చేస్తావా. మీరు మా మెడలు వంచి ధాన్యం కొనిపిస్తారా. మేమే మీ మెడలు వంచడం కాదు విరుస్తాం బిడ్డ. మిమ్మల్ని అడుగడుగునా తరిమి కొడతాం జాగ్రత్త. బండి సంజయ్ ఇప్పటివరకు నిన్ను క్షమించా. ఇక క్షమించేది లేదు అంటూ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ కేంద్రంపై ఫుల్ ఫైర్ అయ్యారు. రేపటి నుండే దేశంలో అగ్గి పెడతాం. వడ్లు మీరు కొంటాం అంటే మేము వద్దంటున్నామా అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే.. కేంద్రం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్డర్​ తీసుకురా తీసుకొస్తే..నేనే దగ్గరుండి విత్తనాలు పంచుతా. రాష్ట్రం మొత్తం వరి పండించేలా చూస్తా. తీసుకురాకపోతే మాత్రం మెడలు వంచటం కాదు. ఇరుస్తాం. దిల్లీ భాజపా బియ్యం కొనమంటారు. సిల్లీ భాజపా వడ్లు పండించుమంటది. ఎవర్ని నమ్మాలి.

కిషన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.  కేంద్ర మంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలని సూచించారు. ‘నేను కూడా కూడా కేంద్ర మంత్రిగా పని చేశా.. పెద్ద పదవి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. హుజురాబాద్‌లో కిషన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

అలాగే నాడు పెట్రోల్ ధర రూ.77 ఉంటే దాన్ని రూ.114 చేశారు. డీజిల్ ధర రూ.68 ఉంటే రూ.107 చేశారు. ఈ పెరుగుదల మొత్తం కేంద్రమే తీసుకుంటోంది. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ భారం మోపుతున్నారు. దానికి తోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారు.

ఇంత మోసం చేసి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెబుతున్నారు. తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేయాలి? మీరా? మేమా? ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నాం. చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 2014 నాటి ధర రూ.77కే ఇవాళ కూడా ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.

అలాగే హుజురాబాద్ ఓటమిపై కేసీఆర్ స్పందించారు. అయితే రాజకీయాల్లో గెలుపోటములు సహజం. హుజురాబాద్ లో మేము ఓడిపోతే మా పని ఆయిపోయినట్లేనా. మాకు 110 ఎమ్మెల్యేల బలం ఉంది. వారు ప్రజలచే ఎన్నుకోబడ్డవారు ఊరికే రాలేదు. ప్రజలు మావైపే ఉన్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.