ఫ్లాష్- 111 జీవోపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

0
101

111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్‌.. దీనిపై అధ్యయనం చేసేందుక నిపుణులు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని స్పష్టం చేశారు.

గతంలో హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చే జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో తీసుకువచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఈ జలాశయాల నీరు ప్రస్తుతం అవసరం లేదన్నారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు జీవో 111 జారీ చేసినప్పటికీ అది సక్రమంగా అమలు కావడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ యథేచ్ఛగా వెంచర్లు వేస్తున్నారు.

జాతీయ రహదారికి సమీపంలో వుండటంతో పలువురు సంపన్నులు ఇక్కడ గెస్ట్ హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారు. ఈ ఉల్లంఘనలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా 111 జీవో మనుగడపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.