మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జాతీయ పార్టీ పెడుతారా.. అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. జాతీయ పార్టీని పెట్టకూడదా అని అన్నారు. పెడితే లాభమే కదా అని అన్నారు. జాతీయ పార్టీ పెడితే తనను ఎవరూ అడ్డుకుంటారని అన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా అందరూ నవ్వారని అన్నారు. అవసరం అయితే తాను జాతీయ పార్టీ పెట్టడానికి సిద్దంగా ఉన్నానని కూడా ప్రకటన చేశారు. కాగ ప్రస్తుతం బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులు ఏకం కావాలని అన్నారు. అది ఫ్రంట్ గానీ పార్టీ గాని ఎదో ఒకటి అవుతుందని అన్నారు. దానిలో తాను మేజర్ పాత్ర పోషిస్తానని అన్నారు.
Breaking: కొత్త పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
CM KCR sensational statement on formation of new party