నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్..జాతీయ రాజకీయాలపై చర్చ

0
104

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.  ఈ మేరకు ప్రగతి భవన్‌ సిబ్బంది అధికారిక ప్రకటన చేసింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు.

జాతీయ రాజకీయాలపై విపక్షాలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లున్నారని సమాచారం అందుతోంది. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు.కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనున్నారు సీఎం కేసీఆర్. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా మిగతా పార్టీలత్ఓ మమేకం చేసుకొని ముందుకు వెళ్లనున్నారు. చూడాలి రాష్ట్రంలో టిఆర్ ఎస్ లా బిఆర్ఎస్ ను దేశంలో ఆదరిస్తారో లేదో చూడాలి.