యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ (వీడియో)

0
86

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌కు గుండె, యాంజియో, సిటీ స్కాన్​ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు.

రెండు రోజులుగా సీఎం కేసీఆర్ బలహీనంగా ఉన్నారని… వైద్యులు ఎం.వి. రావు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్​ నిర్వహించినట్లు చెప్పారు. జనరల్​ చెకప్​లో భాగంగా అన్ని పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.

https://www.facebook.com/alltimereport/videos/1356098441496199