సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్..ఆత్మగౌరవానికే పట్టం కట్టిన హుజురాబాద్ ప్రజలు

CM KCR vs. Itala Rajender..People of Huzurabad who have earned the title of self-respect

0
81

తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే ఫలితాలు వెలువడ్డాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఆ తరువాత జరిగిన సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోలయ్యాయి. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్ తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 23,865 ఓట్ల ఆధిక్యంలో నిలిచి ఘన విజయం సాధించారు.

హుజురాబాద్ రాజకీయ కురుక్షేత్రంలో ఈటలను ఓడించడానికి సీఎం కేసీఆర్ అనేక అస్త్రాలు ఉపయోగించిన ఫలితం లేకుండా పోయింది. అయితే కేసీఆర్ అస్త్రాలు, అభివృద్ధి ఈటల ఆత్మగౌరవం ముందు తోక ముడిచాయి. దానిపై ఓ లుక్కేద్దాం..

కేసీఆర్ బలగం

వ్యక్తిగతంగా

శత్రువును పడగొట్టాలని కక్ష

ధనం 4,500 కోట్ల రూపాయలు

1. దళిత బంధు పేరుతో రెండు వేల కోట్ల రూపాయలు

2. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో రెండు వేల కోట్ల రూపాయలు

3. ఎలక్షన్ కు ఖర్చు చేసిన సొమ్ము సుమారు ఐదు వందల కోట్లు

రాజకీయపరంగా

1. కాంగ్రెస్ కి పార్టీ చెందిన పాడి కౌశిక్ రెడ్డి కి తన పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ గా నామినేట్

2. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన స్వర్గం రవిలను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం.

3. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహను దళిత బంధు పథకం ఆకర్షితులుగా చేర్చుకోవడం.

4. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలను పార్టీలో చేర్చుకోవడం.

ప్రభుత్వ పరంగా

1. ముగ్గురు మంత్రులు

2. సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు

3. బీసీ కమిషన్ చైర్మన్గా హుజురాబాద్ కు చెందిన వకులాభరణం కృష్ణమోహన్ నియమించడం.

4. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా హుజురాబాద్ కు చెందిన వ్యక్తి నియమించడం.

5. సీఎం ఆఫీస్ లో దళిత సామాజిక వర్గానికి చెందిన ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు రాహుల్ బొజ్జాను,
సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవింద్రాలను ప్రాధాన్యత ఇవ్వడం.

6. అకారణంగా తీన్మార్ మల్లన్న జైల్లో నిర్బంధించడం

ఈటల రాజేందర్ బలగం:

వ్యక్తిగతంగా

నిందలు మోపినా శత్రువును పడగొట్టాలని కసి

1. ఉద్యమ నాయకుడు

2. 18 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఓటమెరుగని నాయకుడు

3. ఆత్మగౌరవం

4. బిజెపి అంగబలం.

ఈ విజయంతో ఈటెల తన బలం, బలగం రుచి చూపించారు.