మరో కీలక ఘట్టం..మల్లన్నసాగర్‌ను జాతికి అంకింతం చేయనున్నసీఎం కేసీఆర్

0
87

కాళేశ్వరం ఎత్తిపోతలలో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఆసన్నమైంది. ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ ఇవాళ జాతికి అంకింతం చేయనున్నారు. అలాగే భారీ జలాశయంలోకి లాంఛనంగా నీటిని విడుదల చేయనున్నారు. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు మల్లన్నసాగర్‌ ద్వారానే నీటిని పంపుతారు. నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ జలాశయంపైనే ఆధారపడి ఉంది.