జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..మాజీ సీఎంతో ప్రగతిభవన్ లో భేటీ

0
86

తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ తో సహా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు.

కేసీఆర్ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన వరుస భేటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నేడు హైదరాబాద్ కు వచ్చారు.

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కుమారస్వామి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక రాజకీయాలపై అలాగే దేశ రాజకీయాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. బీజేపీని గద్దె దింపేందుకు నాన్ బీజేపీ నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.